న్యూఢిల్లీ: ఫెదరర్ రిటైర్మెంట్ మ్యాచ్‌లో నాదల్ ఏడ్చేశాడు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. లెవర్ కప్‌లో డబుల్స్ ఆడిన ఇద్దరూ మ్యాచ్ ముగిశాక కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. స్విస్ స్టార్ ఫెదరర్, స్పెయిన్ బుల్ నాదల్.. టెన్నిస్‌లో భీకర ప్రత్యర్థులు. ఇద్దరూ ఓ రెండు దశాబ్ధాల పాటు ఢీ అంటే ఢీ అన్న రీతిలో పోటీపడ్డారు. అయితే లెవర్ కప్ లో మ్యాచ్ ముగిశాక నాదల్ కన్నీరుపెట్టాడు. ప్రత్యర్థి ఫెదరర్ కోసం నాదల్ ఏడవ్వడం అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఆ ఫోటోపై క్రికెటర్ కోహ్లీ రియాక్ట్ అయ్యాడు. నాదల్ కన్నీళ్లు.. ఫెదరర్ ట్యాలెంట్‌ను ప్రూవ్ చేస్తున్నాయని కోహ్లీ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఇద్దరు ప్రత్యర్థులు ఒకరి కోసం ఒకరు ఇలా ఏడ్చేస్తారని ఎవరు అనుకుంటారని, క్రీడల్లో ఉన్న అందమే ఇదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. క్రీడాస్ఫూర్తిని చాటుతున్న గొప్ప ఫోటో ఇదేనన్నాడు. నీ సహచరులు నీ కోసం కన్నీళ్లు కారుస్తుంటే, దేవుడు ఇచ్చిన నీ ప్రతిభను మెచ్చుకోనివారెవరుంటారని కోహ్లీ తెలిపాడు. ఈ విషయంలో ఫెదరర్, నాదల్‌ను గౌరవించడమే తప్ప ఇంకేమీ చేసేది లేదని కోహ్లీ తన ఇన్‌స్టా పోస్టులో అభిప్రాయపడ్డాడు.