కరాచీ: పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగవ టీ20 థ్రిల్లర్‌ను తలపించింది. బాబర్ ఆజమ్ బృందం కేవలం మూడు రన్స్ తేడాతో ఆ మ్యాచ్‌ను రసవత్తరీతిలో చేజిక్కించుకున్నది. దీంతో సిరీస్ 2-2 తేడాతో సమం అయ్యింది. ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే నాలుగో మ్యాచ్‌లో పాక్ ఫీల్డర్ ఉస్మాన్ ఖాదిర్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అలెక్స్ హేల్స్ పుల్ షాట్ ఆడగా.. షార్ట్ మిడ్ ఆన్‌లో ఉన్న ఉస్మాన్ ఖాదిర్.. డైవింగ్ చేస్తూ ఎడమ చేతితో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. హేల్స్ 3 బంతుల్లో 5 రన్స్ చేసి ఔటయ్యాడు. నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 166 రన్స్ చేయగా.. ఆ టార్గెట్‌కు చేరువగా వచ్చిన ఇంగ్లండ్ మరో మూడు రన్స్ తేడాతో ఓటమిపాలైంది.
BLINDER 😱
Usman Qadir pulls off a special catch ✨#PAKvENG | #UKSePK pic.twitter.com/b1yVvzwNLZ
— Pakistan Cricket (@TheRealPCB) September 25, 2022