ఓ ప్రియా ప్రియా.. ‘నువ్వే నా ప్రాణం’
ప్రియా హెగ్డే.. అరక్షణం పాటు సూటిగా చూస్తే కుర్రకారుకు గుండె దడే! ఆ కళ్లకు వయస్కాంత శక్తితో కూడిన అయస్కాంతత్వం ఉంది. కాబట్టే, మోడలింగ్‌లో, టీవీలో మంచి అవకాశాలు వచ్చాయి. కానీ, అక్కడే ఆగిపోలేదు ప్రియ. సౌందర్యాభిమానుల అదృష్టంకొద్దీ తెలుగు పరిశ్రమలో ప్రవేశించింది
ప్రియా హెగ్డే.. అరక్షణం పాటు సూటిగా చూస్తే కుర్రకారుకు గుండె దడే! ఆ కళ్లకు వయస్కాంత శక్తితో కూడిన అయస్కాంతత్వం ఉంది. కాబట్టే, మోడలింగ్‌లో, టీవీలో మంచి అవకాశాలు వచ్చాయి. కానీ, అక్కడే ఆగిపోలేదు ప్రియ. సౌందర్యాభిమానుల అదృష్టంకొద్దీ తెలుగు పరిశ్రమలో ప్రవేశించింది. కాదుకాదు.. సింహద్వారాలు తెరిచి మరీ ‘ఆగతం.. సుస్వాగతం’ అంటూ ఛత్రచామరలతో స్వాగతించింది టాలీవుడ్.
ఇటీవల జరిగిన ‘నువ్వే నా ప్రాణం’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రియా హెగ్డే ముస్తాబును చూడాల్సిందే. లేత గులాబీ రంగు అవుట్‌ఫిట్‌లో తళుక్కున మెరిసింది. గులాబీకే గులాబీల దండ వేసినట్టు.. ప్రియ మేనిఛాయకు అతికినట్టు సరిపోయిందా రంగు. ట్రెడిషనల్ గాగ్రా చోలీకి జతగా స్లీవ్‌లెస్ బ్లౌజ్! విరబోసిన కురుల చాటునుంచి పలకరిస్తున్న పెద్దపెద్ద జుంకాలు, శంఖంలాంటి మెడలో సన్నని గొలుసు, రెండు చేతులకూ కలిపి మొత్తంగా మూడు ఉంగరాలు, మ్యాచింగ్ గాజులు.. సింపుల్ అలంకరణతోనే ‘సింప్లీ సూపర్బ్’ అనిపించుకుంది. కాటుక కళ్ల కనికట్టు, వాచీతో కూడిన మణికట్టు ఆమె అందానికి అదనపు హంగులు అద్దాయి. నాభి దగ్గర పుట్టుమచ్చ ఉన్నవాళ్లు ప్రపంచాన్ని శాసిస్తారని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతున్నది. ఎవరికి తెలుసు? వెండితెర తదుపరి సామ్రాజ్ఞి ఈమే కావచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

