వానల్లో కురులు జాగ్రత్త
వానాకాలం వచ్చిందంటే కేశ సౌందర్యానికి ప్రమాదం వచ్చినట్టే. ఈ కాలంలో మునుపటిలా జుట్టును అందంగా విరబోసుకోవడం కొంచెం కష్టం. దుమ్ము, కాలుష్యం, తేమ నుంచి జుట్టుని కాపాడుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. చాలామంది ఏమవుతుందిలే అనుకుంటారు.
వానాకాలం వచ్చిందంటే కేశ సౌందర్యానికి ప్రమాదం వచ్చినట్టే. ఈ కాలంలో మునుపటిలా జుట్టును అందంగా విరబోసుకోవడం కొంచెం కష్టం. దుమ్ము, కాలుష్యం, తేమ నుంచి జుట్టుని కాపాడుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. చాలామంది ఏమవుతుందిలే అనుకుంటారు. కానీ, జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తితే అయ్యో అంటూ బాధపడతారు. కాబట్టి వానాకాలంలో జుట్టుని నిర్లక్ష్యం చేయొద్దు. చల్లని గాలిలో తిరిగినప్పుడు, చిరు జల్లుల్లో తడిసినప్పుడు జుట్టుని ఎప్పటికప్పుడు ఆరబెట్టుకోవాలి. అలా చేయడం సాధ్యం కానప్పుడు నెత్తి తడవకుండా జాగ్రత్తపడాలి. అయినా, తల తడిస్తే మాడు పొడిగా అయ్యేలా టవల్‌తో తుడిచి, దువ్వెనతో ఆరబెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. అంతేకాని హెయిర్డ్రైలతో ఎక్కువ వేడిని మాడుపై ప్రయోగిస్తే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి.
వారానికో, పది రోజులకో గోరువెచ్చని నూనె లేదా సీరమ్‌తో తలకు మసాజ్ చేయించుకోండి. ఇలా చేయడం వల్ల స్వేద రంధ్రాలు మూసుకుపోవు. అలాగే చలికి భయపడి, జుట్టు తడిస్తే ఆరదేమోననే భయంతో తలస్నానం చేయడం తగ్గించకండి. ఇలా చేస్తే తలలో చేరిన దుమ్ము… చర్మ రంధ్రాలను మూసేస్తుంది. ఫంగస్, ఇతర సూక్ష్మ జీవులకు ఆశ్రయమిస్తుంది. వానలో ప్రయాణాలు వాయిదా వేయలేం. కాబట్టి ఎటు పోయినా తడవకుండా ఉండేందుకు గొడుగు దగ్గర పెట్టుకోవాలి. బ్యాగులో తేమను ఎక్కువగా పీల్చుకొనే టవల్ ఉంచుకుంటే, జల్లుకు తడిసినా తుడుచుకుని ఆరబెట్టుకోవచ్చు. పళ్లు దూరదూరంగా ఉండే పెద్ద దువ్వెన కూడా బ్యాగులో ఉంచుకుంటే తడిసిన జుట్టుని ఆరబెట్టుకునేందుకు ఉపయోగపడుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

