Tollywood Movies | ఈ సారి టాలీవుడ్‌కు కలిసి రాని సమ్మర్ సీజన్.. డబ్బింగ్ సినిమాలదే హవా
Tollywood Movies in Summer Season | కీలకమైన సమ్మర్ సీజన్ ఈ సారి పెద్దగా ప్రభావం చూపలేదు. సినిమా మంత్ కు పిలుచుకునే మే నెల టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వెల వెలబోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. తొలివారం విడుదలైన రామబాణం, ఉగ్రం రెండూ మిక్స్డ్ టాక్ తెచ్చుకుని డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి.
Tollywood Movies in Summer Season | కీలకమైన సమ్మర్ సీజన్ ఈ సారి పెద్దగా ప్రభావం చూపలేదు. సినిమా మంత్ కు పిలుచుకునే మే నెల టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వెల వెలబోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. తొలివారం విడుదలైన రామబాణం, ఉగ్రం రెండూ మిక్స్డ్ టాక్ తెచ్చుకుని డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. ఉగ్రం అటో ఇటో బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వచ్చినా.. రామాబాణం మాత్రం కనీసం బడ్జెట్లో పావు వంతు కలెక్షన్లు కూడా రికవరీ చేయలేకపోయింది. ఇక అక్కినేని అభిమానులు గంపెడంత ఆశలు పెట్టుకున్న కస్టడీ సైతం ఘోర పరాజయంగా నిలిచింది. పాతిక కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా పట్టు మని పది కోట్ల షేర్ కూడా కలెక్ట్ చేయకుండానే వెనక్కి వెళ్లిపోయింది. ఇక మూడో వారం విడుదలైన అన్ని మంచి శకునములే పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. నందిని రెడ్డి వంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌ను నమ్ముకున్నా సంతోష్ శోభన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక అంతో ఇంతో మే నెలకు కాస్త ఉపశమనం ఇచ్చిందంటే మేము ఫేమస్ సినిమానే.
గత వారం విడుదలైన మేము ఫేమస్ టాలీవుడ్ దాహం తీర్చకపోయినా కనీసం నాలుకను తడి చేసింది. మరీ బ్రహ్మండమైన హిట్ కాకపోయినా.. ఉన్నంతలో కాస్త బెటర్ గానే పర్ ఫార్మ్ చేసింది. ఇప్పటికే బ్రేక్ఈవెన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాతో పాటు రిలీజైన మళ్లీ పెళ్లి పెటాకులు అయిందనే చెప్పాలి. విడుదలకు ముందు చేసిన హడావిడితో ఈ సినిమాకు మంచి హైపే వచ్చింది. అయితే ఆ హైప్ ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురాలేకపోయింది. ఇప్పటికే సగం థియేటర్లను ఈ సినిమా ఖాళీ చేసింది. ఇక టాలీవుడ్ సినిమాల సంగతి పక్కన పెడితే మే నెల మాత్రం డబ్బింగ్ సినిమాలకు మంచి గిట్టుబాటు అయింది. మే నెల రెండో వారంలో విడుదలైన ది కేరళ స్టోరీకి బాగానే కలిసి వచ్చింది. చాలా విమర్శలు వచ్చినప్పటికీ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఈ సినిమా వైపు మొగ్గుచూపారు.
ఇక మూడో వారం విడుదలైన బిచ్చగాడు-2 తొలిరోజే నాలుగు కోట్లకు పైగా గ్రాస్ ను సాధించి సంచలనం సృష్టించింది. అదీ కూడా డివైడ్ టాక్ తో. ఈ మధ్య రిలీజైన టాలీవుడ్ సినిమాలు సైతం ఆ రేంజ్ ఫిగర్ ను రాబట్టలేకపోయాయి. ‘బిచ్చగాడు’ అనే బ్రాండ్ నేమ్ తప్పితే పార్ట్-2పై తెలుగులో ఏమంత బజ్ ఏర్పడలేదు. ప్రమోషన్లు గట్రా కూడా భారీ స్థాయిలో జరుపలేరు. ఇక టీజర్, ట్రైలర్లు కూడా సినిమాపై ఓ మోస్తరు అంచనాలే క్రియేట్ చేశాయి. కట్ చేస్తే నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కు టచ్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.
ఇక గతవారం సైలెంట్ గా వచ్చిన 2018 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. తొలిరోజే కోటికి పైగా గ్రాస్ ను సాధించి కిందటి వారం విడుదలైన తెలుగు సినిమాలను సైతం బీట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు మూడు కోట్లకు పైగా లాభాలు అందుకున్నారట. ఇక ఈ వారం కూడా పెద్ద సినిమాలేవి రిలీజ్ కాకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశమే. అయితే ఈ సిినిమా వచ్చే వారం ఓటీటీలో విడుదల కానుంది. ఇది కాస్త డిస్ట్రిబ్యూటర్లకు చేదు వార్తే. ఇలా మొత్తానికైతే మే నెలలో డబ్బింగ్ సినిమాలే హవా చూపాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

