మతమార్పిడి వ్యతిరేక బిల్లుకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం

భోపాల్: మతమార్పుడులకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన బిల్లుకు ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. పెళ్లి ద్వారా కానీ, ఇతర పద్దతుల్లో మతమార్పుడులను వ్యతిరేకించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని డ్రాఫ్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఇవాళ ఆమోదం దక్కింది. కొత్త చట్టం ప్రకారం మత మార్పిడులకు పాల్పడిన వారికి పదేళ్లు జైలుశిక్ష విధించనున్నారు. భారీ జరిమానాలు విధించే రీతిలోనూ చట్టాలను తయారు చేశారు. మధ్యప్రదేశ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లును మార్చి ఒకటో తేదీన హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు. ఇవాళ మూజువాణీ ఓటు ద్వారా ఆ బిల్లును పాస్ చేశారు. మతమార్పుడి ఆర్డినెన్స్‌కు జనవరి 9వ తేదీన గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పచ్చజెండా ఊపారు. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం 23 కేసులు నమోదు అయినట్లు గత నెలలో మంత్రి నరోత్తమ్ తెలిపారు. భోపాల్ డివిజన్లో ఏడు, ఇండోర్‌లో అయిదు, జబల్పూర్లో నాలుగు, గ్వాలియర్‌లో మూడు కేసులు నమోదు అయినట్లు మంత్రి తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

