Made in Heaven New Season | మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Made in Heaven Season 2 | ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ నుంచి నాలుగేళ్ళ కిందట వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ (Made in Heaven) ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా ఫస్ట్ వేవ్ (Corona First wave) టైంలో వచ్చిన ఈ సిరీస్ ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Made in Heaven Season 2 | ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ నుంచి నాలుగేళ్ళ కిందట వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ (Made in Heaven) వెబ్ సిరీస్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో వచ్చిన ఈ సిరీస్ ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పెళ్లిళ్లు స్వర్గంలోనే అవుతాయన్న నానుడినే ఆధారంగా చేసుకొని ప్రముఖ బాలీవుడ్ రైటర్, నిర్మాత జోయా అక్తర్ (Zoya Akthar) ఈ సిరీస్‌ను నిర్మించగా.. వెడ్డింగ్ ప్లానర్స్‌గా మారిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ల జీవితాల చుట్టూ తిరిగే కథనే ఈ మేడిన్ హెవెన్.
ఈ సిరీస్‌లో తెలుగు నటి శోభితా దూళిపాళ్ల (Shobitha Dhulipalla)తోపాటు అర్జున్ మాథుర్(Arjun Mathur), కల్కి కొచ్లిన్ (Kalki Koechlin), జిమ్ సర్బా (Jim Sarbh), శశాంక్ అరోరా (Shashank Arora), శివానీ రాఘువన్శి, రసిక దుగ్గల్ (Rasika Duggal) తదితరులు ప్రధానపాత్రలు పోషించారు. కాగా ఈ సిరీస్ రెండో సీజన్ కోసం అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మోస్ట్ అవైటేడ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ (Made in Heaven Season 2) అప్డేట్ను మేకర్స్ తాజాగా ప్రకటించారు.

Made In Heaven Season 2
ఆగస్ట్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో సీజన్ 2 స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలుపుతూ.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. “కాలం మారుతుంది, పెళ్లిళ్లు గ్రాండ్‌గా మారుతాయి, మేడ్ ఇన్ హెవెన్ మళ్లీ వస్తోంది” అంటూ అమెజాన్ ప్రైమ్ ఇండియా ట్విట్టర్లో రాసుకోచ్చింది. అలాగే దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇక మొదటి సీజన్లో లీడ్ రోల్స్‌లో ఉన్న శోభితా దూళిపాళ్ల, అర్జున్ మాథుర్, కల్కి కొచ్లిన్, జిమ్ సర్బా, శశాంక్ అరోరా, శివానీలు ఈ సీజన్లో కూడా అలరించనున్నారు.
times will change, weddings will turn grand, Made In Heaven is coming back!#MadeInHeavenOnPrime S2, Aug 10@madeinheaventv @sobhitaD #ArjunMathur @jimSarbh @kalkikanmani @ShashankSArora #ShivaniRaghuvanshi #MonaSingh @ActorVijayRaaz @IshwakSingh #TrinetraHaldar #ZoyaAkhtar… pic.twitter.com/x3qWVA45Lu
— prime video IN (@PrimeVideoIN) July 26, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

