మదుపు చేసే ముందు ఆలోచించాల్సిన మరో విషయం ద్రవ్యలభ్యత. పెట్టుబడులను ఎప్పుడంటే అప్పుడు వెనక్కి తీసుకునే వీలుండటమే లిక్విడిటీ. ఎమర్జెన్సీ సమయాల్లో నిధులు అవసరమైనప్పుడు లిక్విడిటీ లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చేసిన మదుపు అవసరానికి అందుబాటులో లేకపోతే వృథానే. రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ తక్కువ. సేవింగ్స్ అకౌంట్కు అత్యధిక లిక్విడిటీ ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ కింద జమ చేసే మొత్తాలకు లిక్విడిటీ ఎక్కువగా ఉండేలా చూడాల్సిందే.