అప్పులన్నీ తీరిస్తే అదే ఆనందం
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు హీరో కిరణ్ అబ్బవరం. స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జాయ్ ఫిల్మ్స్ పతాకంపై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నంలో చిత్రీకరణ జరుగుతున్నది.
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు హీరో కిరణ్ అబ్బవరం. స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జాయ్ ఫిల్మ్స్ పతాకంపై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నంలో చిత్రీకరణ జరుగుతున్నది. సోమవారం టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇందులో హోటల్‌ను నడుపుకునే ఆనంద్ అనే వ్యక్తిగా కనిపించారు కిరణ్ అబ్బవరం.
కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీర్చినరోజే తనకు నిజమైన ఆనందమని చెబుతుంటాడు. మధ్యతరగతి యువకుడి జీవితాన్ని ప్రతిబింబిస్తూ ‘రియాలిటీ’ టైటిల్‌కు తగినట్లుగా ఆయన పాత్ర సాగింది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. దేవికాభట్, శరత్‌కుమార్, సాయికుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: కిరణ్ అబ్బవరం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

