తగ్గేదే లే అంటూ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా నుండి ఐకానిక్ స్టార్‌గా మారబోతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. బన్నీ బర్త్‌డే సందర్భంగా బుధవారం రోజు టీజర్ విడుదల చేయగా, ఇందులో పుష్పరాజ్‌గా బన్నీ నట అభినయం ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని అందించింది. ఇక పుష్పరాజ్ పాత్ర పరిచయంలో భాగంగా ఓ వేడుకను ఏర్పాటు చేయగా, ఆ కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ.. నా పుట్టిన రోజును మీతో కలసి సెలబ్రేట్ చేసుకోవటం సంతోషంగా ఉంది. ఇంతకంటే ఏం కావాలి! ఈ బర్త్‌డే నాకు చాలా స్పెషల్‌గా మిగిలిపోతుంది.ఆర్యతో నన్ను స్టైలిష్ స్టార్‌గా మార్చిన సుకుమార్ గారు ఇప్పుడు పుష్పతో ఐకానిక్ స్టార్‌గా మార్చబోతున్నారు. ఆయన ఏం ఇచ్చిన జీవితాంతం గుర్తుండి పోతుంది అని అన్నారు బన్నీ.
పుష్ప సినిమాలో ‘తగ్గేదే లే…’ అనేది సినిమాలో క్యారెక్టర్‌కు వాడే ఊత పదం మాత్రమే కాదు నా హృదయానికి చాలా దగ్గరైన మాట కూడా. నాకు భయమేసినప్పుడు నాకు నేను చెప్పుకునే మాట.. నన్ను నేను ప్రోత్సహించుకోవటానికి మరింత కష్టపడటానికి చెప్పుకునే మాట. ‘పుష్ప’తో దేవీ, సుకుమార్, నేను…. ముగ్గురం కలసి వస్తున్నాం. దేవి శ్రీ ప్రసాద్ కూడా తన సంగీతంతో తగ్గేది లే.. అన్నారు. బన్నీ నోటి నుండి తగ్గేదే లే అనే డైలాగ్ రావడంతో ఫ్యాన్స్ తెగ గోలలు చేస్తూ రచ్చ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

