పవన్ కళ్యాణ్‌ను కలిసిన హరీష్ శంకర్..ఫొటోలు వైరల్

ఇండస్ట్రీలో కొన్ని ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ ఉంటాయి. వాళ్లెప్పుడు కలిసి పని చేసినా కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. టాలీవుడ్ లో అలాంటి అరుదైన కాంబినేషన్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్. ఈ ఇద్దరూ కలిసి చేసింది ఒకే సినిమా.. కానీ అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను చెల్లాచెదురు చేసింది ఆ సినిమా. దాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. 2012లో విడుదలైన ఆ చిత్రం గబ్బర్ సింగ్. పవన్ 11 ఏళ్ళ ఫ్లాపులకు స్వస్తి చెప్తూ హరీష్ శంకర్ ఇచ్చిన ఈ గిఫ్టును మెగాభిమానులు ఇప్పటికీ మరిచిపోలేరు. అందుకే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ ఆయన్ని కేరాఫ్ గబ్బర్ సింగ్ అనే పిలుస్తుంటారు.
అంతగా ఆయనకు ఈ చిత్రం గుర్తింపు తీసుకొచ్చింది. నిజానికి హరీష్ కు కూడా ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలు పర్లేదనిపించాయే కానీ బాక్సాఫీస్ బద్ధలైపోయే విజయాలు కావు. అందుకే ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చేయబోతున్నాడు ఈయన. రీ ఎంట్రీలో అంతా చిన్న దర్శకులతోనే సినిమాలు చేస్తున్న పవర్ స్టార్.. తొలిసారి హరీష్ శంకర్ లాంటి క్రేజీ దర్శకుడితో జోడీకట్టాడు. దాంతో అంచనాలు కూడా ఆకాశంలో ఉన్నాయి.
పైగా ఈ సారి వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుందని పోస్టర్ లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. తాజాగా మార్చ్ 31న ఈయన పుట్టిన రోజు సందర్భంగా పవన్ ను ప్రత్యేకంగా కలిసాడు బర్త్ డే బాయ్ హరీష్ శంకర్. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే PSPK 28 మొదలు కానుంది. దీనికోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు పవన్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న క్రిష్ హరిహర వీరమల్లు, అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ పూర్తి కాగానే హరీష్ శంకర్ సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు పవన్. ఏదేమైనా కూడా ఈ పవర్ బ్లాస్టింగ్ కాంబినేషన్ కోసం అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

