Haiti earthquake : హైతీ భూకంపం.. 1,300కు పెరిగిన మృతులు
Haiti earthquake : హైతీ భూకంపం.. 1,300కు పెరిగిన మృతులు

పోర్ట్-ఓ-ప్రిన్స్ : కరేబియన్ ద్వీప దేశం హైతీలో భూకంపం పెను విలయం సృష్టించింది. భారీ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 1,300 మంది దుర్మరణం చెందారు. పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమవడంతో భవనాల కింద శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అమెరికా సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను మోహరించింది. శనివారం తెల్లవారు జామున హైతీలో రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. శనివారం రోజంతా ప్రకంపనలు కొనసాగాయి.

ఆదివారం తెల్లవారు జామున సైతం ప్రకంపనలు వచ్చాయి. భారీ భూకంపానికి వేలాది సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు 1,300 మంది మృతి చెందారని దేశ పౌర రక్షణ సంస్థ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కరేబియన్ ద్వీప దేశంలో భూకంపం ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తుండగా.. పెను విధ్వంసానికి ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. భయంతో ఒక్కసారిగా ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు.

భారీగా మట్టిపెళ్లలు వంటివి విరిగిపడటంతో సహాయక చర్యలకు కూడా విఘాతం కలుగుతోంది. ఎంతోమంది నిరాశ్రయులు కాగా.. భయంతో ప్రజలంతా రాత్రివేళ బిక్కుబిక్కుమంటూ వీధులు, చర్చిల్లో కాలం గడుపుతున్నారు. మరో వైపు పెద్ద సంఖ్యలో జనం గాయాలకు గురవగా.. ఆసుపత్రులు నిండిపోయాయి. గత నెల 7న హైతీ దేశ అధ్యక్షుడు జొవెనెల్ మోయిస్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ఇప్పటికీ ఆ దేశం షాక్‌లో ఉండగా.. భూకంపం మరింత విషాదంలోకి నెట్టింది. ‘నేటి భూకంపం హైతీకి రాజకీయ అస్థిరత.. హింస, కొవిడ్ -19, పెరుగుతున్న ఆహార అభద్రత మరో ఎదురుదెబ్బ’ అని యాక్టింగ్ హైతీ డైరెక్టర్ కారా బక్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

