Haiti earthquake : హైతీ భూకంపం.. 1,941కి పెరిగిన మృతులు
Haiti earthquake : హైతీ భూకంపం.. 1,941కి పెరిగిన మృతులు | హైతీలో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. గత శనివారం వచ్చిన ప్రకంపనల ధాటికి పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలు తొలగించిన కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. ప్రకంపనలతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,941కు

పోర్ట్-ఓ-ప్రిన్స్ : హైతీలో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. గత శనివారం వచ్చిన ప్రకంపనల ధాటికి పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలు తొలగించిన కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. ప్రకంపనలతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,941కు పెరిగిందని దేశ పౌర రక్షణ సంస్థ మంగళవారం తెలిపింది. ఇప్పటికే భూకంపం ధాటికి జనం విలవిలలాడుతుండగా.. తుఫాను ప్రభావంతో కుండపోత వర్షం కురుస్తున్నది.
పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో శనివారం తెల్లవారు జామున భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 9,900 మందికిపైగా గాయపడగా.. 76వేలకుపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. విపత్తు కారణంగా అర మిలియన్లకుపైగా పిల్లలు ప్రభావితమయ్యారని యూనిసెఫ్ తెలిపింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో తీర ప్రాంత పట్టణమైన లెస్‌కేస్‌లో నిర్వాసితులు ఫుట్‌బాల్ మైదానాలు, చర్చిల్లో ఆశ్రయం పొందారు.
ఇదిలా ఉండగా.. వర్షాల నేపథ్యంలో వరదలు సంభవించే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ ఫ్లాష్ అండ్ అర్బన్ హెచ్చరించింది. భూకంపం ప్రభావంతో బీటలు వారిన భవనాల్లో నీరు చేరి కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పింది. భారీ వర్షాలతో ప్రజలకు తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూకంపం ప్రభావిత నాలుగు ప్రావిన్సుల్లో ప్రభుత్వం నెల రోజుల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గత 48 గంటల్లో రెస్క్యూ వర్కర్లు 34 మందిని సజీవంగా శిథిలాల నుంచి బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

