తల వెంట్రుకలే డ్రెస్‌గా.. వీడియో వైరల్
హెప్గల్5 అనే పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓ యువతి తన తల వెంట్రుకల డ్రెస్ క్రియేటివిటీ విశేషంగా ఆకర్శిస్తున్నది

కొందరు తమ సృజనాత్మకతతో మనల్ని కట్టిపడేస్తుంటారు. చాలామంది సృజనాత్మకత మనకు కొత్తగా, ఆకట్టుకునేదిగా ఉంటుంది. కొందరి క్రియేటివిటీని చూడగానే.. వావ్! ఎంత బాగుందో.. అని ప్రశంసిస్తుంటాం. మన దగ్గరివాళ్లైతే కామెంట్స్ పెడతాం. మన ఇంటివారైతే వారి గురించి పదిమందికి తెలిసేలా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తాం. అలాంటి క్రియేటివిటీని ప్రదర్శిస్తూ ఓ అమ్మడు ఆకట్టుకుంటున్నది.
హెప్గల్5 అనే పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓ యువతి తన తల వెంట్రుకల డ్రెస్ క్రియేటివిటీ విశేషంగా ఆకర్శిస్తున్నది. పొడవైన తల వెంట్రుకలను బాగా దువ్వి డ్రెస్ మాదిరిగా తయారుచేసుకున్నది. నడుం భాగంలో వెడల్పాటి నల్లటి బెల్టు ధరించింది. తలకు టోపీ, కళ్లకు చలువద్దాలతో ఆ కొత్త రకం డ్రెస్‌తో ఫొటోలకు పోజులిచ్చింది. పొడవాటి వెంట్రుకలను అలా డ్రెస్ మాదిరిగా చేసుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాలుగు వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఎందరో కామెంట్లు చేశారు. కొందరు ఎడిటింగ్ చేశారని అనగా.. మరికొందరు నిజమైన వెంట్రుకలు కావని రాశారు. హెయిర్ ఎక్స్టెన్షన్ అని ఇంకొందరు కామెంట్లు పోస్ట్ చేశారు. ఎడిటింగ్ కానీ, నకిలీ వెంట్రుకలు కానీ.. ఆ యువతి సృజనాత్మకతకు మాత్రం సలాం చెప్పాల్సిందే కదూ..?!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

