చిత్రంలో కనిపిస్తున్నది మామూలు గడ్డిచిలుక కాదు. స్త్రీ, పురుష లక్షణాలు రెండూ కలిగి ఉన్నది. ద్విలింగ లక్షణాలు ఉన్న ఏకైక కీటకం ఇదే. దీనికి చార్లీ అని పేరు పెట్టారు. మగ గడ్డిచిలుకను పోలిన రెక్కలు, ఆడ గడ్డిచిలుకను పోలిన శరీరం చార్లీకి ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లండన్ మ్యూజియంలో దీనిపై పరిశోధనలు చేస్తున్నారు.