పేపర్ బాయ్ హీరో తాజా చిత్ర టీజర్ విడుదల

పేపర్ బాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని అలరించిన కుర్ర హీరో సంతోష్ శోభన్. ప్రస్తుతం ఏక్ మినీ కథ అనే సినిమా చేస్తున్నాడు. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుంది. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టున్నాయి.
శివరాత్రి సందర్భంగా చిత్ర టీజర్ విడుదల చేశారు . నా పేరు సంతోష్.. నేనొక సివిల్ ఇంజినీర్.. నాకు ఓ చిన్న ప్రాబ్లమ్ ఉంది అనే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయింది. ఇందులో చూపించిన సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌ను బాగా కనెక్ట్ అవుతున్నాయి. చిత్రం కూడా యూత్‌ని దృష్టిలో పెట్టుకొని తీసినట్టు అనిపిస్తుంది. ‘ఏక్ మినీ కథ’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించాడు. ఇందులో బ్రహ్మాజీ , సుదర్శన్, హర్షవర్ధన్ ,సప్తగిరి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- ek mini katha
- santosh
- teaser
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

