Lisa Marie Presley: ప్రఖ్యాత సింగర్ ఎల్విస్ ప్రెస్లీ కూతురు లీసా మేరీ ప్రెస్లీ మృతి
Lisa Marie Presley ప్రఖ్యాత రాక్ అండ్ రోల్ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ కూతురు లీసా మారి ప్రెస్లీ కన్నుమూశారు. ఆమె వయసు 54 ఏళ్లు. తన కూతురు లీసా భౌతికంగా తమకు దూరమైనట్లు ఎల్విస్ ప్రెస్లీ భార్య ప్రిసిల్లా ప్రెస్లీ తెలిపారు. లీసా ప్రెస్లీ కూడా మేటి సింగర్. గుండెపోటు రావడంతో ఆమెను గురువారం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాలి
కాలిఫోర్నియా: ప్రఖ్యాత రాక్ అండ్ రోల్ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ కూతురు లీసా మారి ప్రెస్లీ మృతిచెందారు. ఆమె వయసు 54 ఏళ్లు. తన కూతురు లీసా భౌతికంగా తమకు దూరమైనట్లు ఎల్విస్ ప్రెస్లీ భార్య ప్రిసిల్లా ప్రెస్లీ తెలిపారు. లీసా ప్రెస్లీ కూడా మేటి సింగర్. గుండెపోటు రావడంతో ఆమెను గురువారం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాలిఫోర్నియాలోని తన ఇంట్లో నిస్సహాయ స్థితిలో లీసా ఉన్నట్లు గమనించారు.
లీసా 1968లో జన్మించారు. తన తండ్రి అడుగుజాడల్లోనే ఆమె ఎదిగారు. మ్యూజిక్‌నే కేరీర్‌గా ఎంచుకున్నారు. లీసా మొత్తం మూడు ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. 2003లో తన మొదటి ఆల్బమ్ రిలీజ్ చేసిందామె. దానికి పాజిటివ్ రివ్వ్యూస్ వచ్చాయి. లీసా మొత్తం నలుగుర్ని పెళ్లాడింది. లెజండరీ సింగర్ మైఖేల్ జాక్సన్‌ను లీసా పెళ్లి చేసుకున్నారు. ఫిల్మ్ స్టార్ నికోలస్ కేజ్, మ్యుజిషియన్ డానీ కీనో, మైఖేల్ లాక్వుడ్లు కూడా ఆ లిస్టులో ఉన్నారు. లీసాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
బెవర్లీ హిల్స్‌లో మంగళవారం రాత్రి జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో లీసా ప్రెస్లీ తన తల్లితో కలిసి పాల్గొన్నది. ఎల్విస్ కథాంశంతో తీసిన ఎల్విస్ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన ఆస్టిన్ బట్లర్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ఆ కార్యక్రమాన్ని లీసా ప్రత్యక్షంగా వీక్షించింది. ఆ సమయంలో తల్లీ కూతుళ్లు ఇద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. అవార్డు అందుకున్న సమయంలో ప్రెస్లీ ఫ్యామిలీకి బట్లర్ థ్యాంక్స్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

