Prabhas | ‘డార్లింగ్’ రీ-రిలీజ్‌తో బాక్సాఫీస్‌కు ఊపిరి… మరోసారి ప్రూవ్ అయిన ప్రభాస్ స్టామినా !
Prabhas | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత కొన్నాళ్లుగా నెలకొన్న సైలెన్స్‌ను రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి చెరిపేస్తున్నారు. భారీ సినిమాల హవాతో థియేటర్లు వెలవెలబోతున్న సమయంలో, ఇటీవల వచ్చిన చిన్న సినిమాలు కొంత ఊరటనిచ్చినా… పూర్తి స్థాయిలో ఊపు మాత్రం రాలేదు. ఈ క్రమంలో అడివి శేష్ నటించిన ‘డెకాయిట్’ చిత్రం మంచి ప్లానింగ్, ప్రమోషన్లతో బ్రేక్ ఈవెన్ సాధించి థియేటర్లకు కొంత ఊపిరి పోసింది. అయితే ఆ సినిమా రన్ ముగిసే సరికి మళ్లీ డల్ పరిస్థితి నెలకొంటుందనుకున్న సమయంలో… ‘డార్లింగ్’ రీ-రిలీజ్ రూపంలో బాక్సాఫీస్‌కు కొత్త జోష్ వచ్చింది.

ప్రభాస్ కెరీర్లో క్లాసిక్‌గా నిలిచిన డార్లింగ్ సినిమా రీ-రిలీజ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.3 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. ఇది ప్రభాస్ క్రేజ్‌కు నిదర్శనంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా వింటేజ్ ప్రభాస్‌ను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
దర్శకుడు ఏ.కరుణాకరన్ తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి మాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన రావడం విశేషం. ఈ వీకెండ్ వరకు ‘డార్లింగ్’ జోరు కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెద్ద సినిమాలు లేకపోయిన సమయంలో ఈ రీ-రిలీజ్ బాక్సాఫీస్‌కు మంచి బూస్ట్ ఇచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ది రాజాసాబ్ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా… ‘డార్లింగ్’ రీ-రిలీజ్‌తో ప్రభాస్ మరోసారి తన స్టార్‌డమ్‌ను నిరూపించుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి సరైన కంటెంట్ లేక బాక్సాఫీస్ స్తబ్దంగా ఉన్న సమయంలో, ఒక రీ-రిలీజ్ సినిమా కూడా థియేటర్లకు జీవం పోయగలదని ‘డార్లింగ్’ మరోసారి రుజువు చేసింది. ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని స్పష్టమైంది. ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?