ఈఎస్ఐ అక్రమాలపై విచారణ జరిపించాలి : వెస్లీ
రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఈఎస్ఐ దవాఖానల్లో క్లీనింగ్ కాంట్రాక్టుల పేరుతో జరిగిన అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఈఎస్ఐ దవాఖానల్లో క్లీనింగ్ కాంట్రాక్టుల పేరుతో జరిగిన అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం విజిలెన్స్ విచారణతో సరిపెట్టకుండా, ఈ కుంభకోణంపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధి కల్పనా కమిటీ నివేదికను, అధికారుల సిఫార్సులను సైతం తుంగలో తొకి, క్లీనింగ్ చార్జీలను చదరపు అడుగుకు రూ.10 నుంచి రూ.49.50 పెంచారని తెలిపారు. ఇందులో ఉన్నతాధికారి హస్తం ఉన్నదని ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల గతంలో నెలకు రూ.61.71 లక్షలు ఉన్న ఖర్చును రూ.3.05 కోట్లకు పెంచి కార్మికుల కష్టార్జితాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

