Mega 157 | చిరు – అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా?
Chiranjeevi New Movie | అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను షురూ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు.
Chiranjeevi – Anil ravipudi | అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను షురూ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు. మెగా157 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మింస్తుండగా.. చిరంజీవి ఈ చిత్రంలో తన నిజ పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ వైరల్‌గా మారింది.
ఈ సినిమా షూటింగ్‌ను మే 22 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నారు.
అలాగే అనిల్ రావిపూడి ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్‌ను వైజాగ్‌లో రాస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా నటించనున్నారని సమాచారం. అలాగే, సీనియర్ నటుడు వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
Ori Nayano | హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

