కెరీర్ మొదట్లో ఎంత అందంగా ఉండేదో, ఇద్దరు బిడ్డల తల్లి అయ్యాక కూడా అంతే ఆకర్షణీయంగా కనిపిస్తున్నది కరీనా కపూర్. తన సౌందర్య రహస్యాల గురించి అప్పుడప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చిట్కాలు కూడా చెబుతున్నది.
మంచి క్లెన్సర్‌తో రోజును ప్రారంభిస్తాను. అది కూడా తేమను తగ్గించకుండా, ముఖాన్ని శుభ్రం చేసే రకాలనే ఎంచుకుంటాను.
నా చర్మం సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా అప్పుడప్పుడూ పొడిబారిపోతుంది. అందుకే నేను సన్‌స్క్రీన్ లోషన్ల విషయంలో రాజీపడను.
మా అమ్మ, అక్క నాకు సౌందర్య చిట్కాలు చెబుతుంటారు. సంప్రదాయ పద్ధతులు సిఫారసు చేస్తుంటారు. ముఖ్యంగా తేనెను వాళ్లే పరిచయం చేశారు.
అప్పటికి, ఇప్పటికి అందం విషయంలో నాకు మా కరిష్మా కపూరే స్ఫూర్తి. తనని చూస్తూ పెరిగాను నేను. ఇప్పటికీ అక్కనే అనుసరిస్తాను.
ఎక్కడికి వెళ్లినా నా హ్యాండ్ బ్యాగ్‌లో బీబీ క్రీమ్, మాయిశ్చరైజర్, హెయిర్ సీరమ్ తప్పకుండా ఉంటాయి. బ్యాగే నా బ్యూటీ పార్లర్.