బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. దర్శకుడు హర్ష పులిపాక ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘అరెరే అరెరే మాటే రాదే’ పాట లిరికల్ వీడియోను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. పాట బాగుందని, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…‘ఇటీవల మన సినిమాల్లో పెళ్లి పాటలు తగ్గిపోయాయి. ఆ అనుభూతిని మా చిత్రంలోని పాటలో చూస్తారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.