గత ఏడాది ‘సయారా’ చిత్రం ద్వారా యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది యువ నాయిక అనీత్ పడ్డా. తాజా సమాచారం ప్రకారం ఈ భామ బాలీవుడ్లో బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతున్నది.. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం మేకర్స్ అనీత్ పడ్డాను సంప్రదించారని బాలీవుడ్ టాక్.
అయితే ఈ సినిమాలో ఆమె కథానాయకుడు రణ్‌బీర్‌కపూర్‌కు జోడీగా నటిస్తున్నదా? లేదా ఇతర ప్రధాన పాత్రలో కనిపించనుందా? అనే విషయంలో స్పష్టతలేదు. ‘బ్రహ్మాస్త్ర’ తొలిభాగంలో రణ్‌బీర్‌కపూర్, అలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. రెండో భాగంలో కథను మరింతగా విస్తరించడంతో కొత్త పాత్రలు, కొత్త నటీనటులు చేరే అవకాశం ఉంది.