మెల్బోర్న్: సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో జర్మనీ స్టార్, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ముందంజ వేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జ్వెరెవ్ 6-4, 6-4, 6-0తో మిల్మాన్పై విజయం సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన జ్వెరెవ్.. వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. అలెగ్జాండర్ 14 ఏస్‌లతో విశ్వరూపం కనబర్చగా.. ప్రత్యర్థి ఒక్కటంటే ఒక్క ఏస్ కొట్టలేకపోయాడు. ఆరు బ్రేక్ పాయింట్లు సాధించి ముందంజ వేసిన జ్వెరెవ్.. శుక్రవారం అల్బాట్తో తలపడనున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో.. బెర్టినీ, షపలోవ్ విజయాలు సాధించారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో జపాన్ స్టార్ నవోమీ ఒసాక 6-0, 6-4తో బ్రెంగిల్పై గెలుపొందగా.. టాప్ సీడ్ ఆష్లే బార్టీ, సక్కారి, ఓస్టపెంకో, అజరెంక, స్వితోలిన విజయాలతో ముందంజ వేశారు. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా-నదియా జోడీ ఓటమి పాలవగా.. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న-రోజర్ జంట పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.