బాబా కా దాబా కథ మళ్లీ మొదటికి..!!

న్యూఢిల్లీ: సోషల్‌మీడియా ద్వారా ఫేమస్ అయి రెస్టారెంట్ పెట్టుకున్న బాబా కా దాబా కాంతా ప్రసాద్ కథ మొదటికొచ్చింది. కరోనా లాక్డౌన్ వల్ల నష్టపోయిన కాంతా ప్రసాద్ తన రెస్టారెంట్ మూసివేసి తిరిగి బాబా కా దాబా ఓపెన్ చేశాడు. లాక్‌డౌన్‌కు ముందు రోజూ రూ.3,500 ఆదాయం వస్తుండగా అదికాస్తా రూ. వెయ్యికి పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశాడు. ఆ ఆదాయం తమ కుటుంబంలోని ఎనిమిది మందికి సరిపోదని తెలిపాడు.
దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఈ బాబా కా దాబా ఉంది. ఎంతో రుచికరమైన ఆహార పదార్ఠాలున్నా ఎవరూ రావడం లేదని కాంతాప్రసాద్ ఏడుస్తున్న వీడియోను యూట్యూబర్ గౌరవ్ వాసన్ సోషల్‌మీడియాలో షేర్చేశాడు. దీంతో కాంతా ప్రసాద్ రాత్రికేరాత్రే ఫేమస్ అయిపోయాడు.
లక్షల రూపాయాల విరాళాలు వచ్చాయి. అలాగే, బాబా కా దాబాకు జనం క్యూకట్టారు. ఇలా వచ్చిన డబ్బుతో కాంతాప్రసాద్ తన పాత అప్పులు తీర్చుకున్నాడు. తన పిల్లలకు ఫోన్లు కొన్నాడు. ఓ కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. కానీ, వృద్ధుడైన కాంతాప్రసాద్పై విధి మళ్లీ పగబట్టింది. రెస్టారెంట్లో నష్టాలు రావడంతో తిరిగి తనకు లైఫ్ ఇచ్చిన రోడ్‌సైడ్ బాబా కా దాబాకు వచ్చేశాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

