Watch: వీధి కుక్కలకు ఆహారం పెట్టడంపై వృద్ధుడు అభ్యంతరం.. కర్రతో దారుణంగా కొట్టిన మహిళ
Woman Thrashes Elderly Man | వీధి కుక్కలకు ఆహారం పెట్టడంపై ఒక వృద్ధుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఒక మహిళ కర్రతో అతడ్ని దారుణంగా కొట్టింది (Woman Thrashes Elderly). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: వీధి కుక్కలకు ఆహారం పెట్టడంపై ఒక వృద్ధుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఒక మహిళ కర్రతో అతడ్ని దారుణంగా కొట్టింది (Woman Thrashes Elderly). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతంలోని పంచశీల్ హౌసింగ్ సొసైటీకి చెందిన 23 ఏండ్ల సిమ్రాన్ మంగళవారం రాత్రి వేళ వీధి కుక్కలకు ఆహారం పెట్టింది. అయితే అదే హౌసింగ్ సొసైటీకి చెందిన 78 ఏళ్ల రూప్‌నారాయణ మెహ్రా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. వీధి కుక్కలకు అక్కడ ఆహారం పెట్టవద్దని, మరోచోట పెట్టాలని చెప్పాడు. కుక్కలు జనాల్ని కరుస్తున్నాయని అన్నాడు.
కాగా, సిమ్రాన్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాచ్‌మ్యాన్ చేతిలోని కర్ర తీసుకుని వృద్ధుడిపై దాడి చేసింది. అపార్ట్మెంట్ వాసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. వృద్ధుడ్ని పలుమార్లు కర్రతో కొట్టింది. రూప్‌నారాయణ మెహ్రా కుటుంబం ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సిమ్రాన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఆ మహిళ కర్రతో వృద్ధుడ్ని కొట్టడాన్ని చాలా మంది తప్పుపట్టారు.
https://twitter.com/AsiamanchYt/status/1686815733366583296?s=20
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

