లక్నో: బజారుకు వచ్చిన మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ను ఒక వ్యక్తి లాక్కున్నాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే కొందరు వ్యక్తులు అతడ్ని పట్టుకున్నారు. దీంతో ఆ మహిళ అతడ్ని చితక్కొట్టింది. (Woman Slaps Beats Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ సంఘటన జరిగింది. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపుల్ ప్రాంతంలో షాపింగ్ కోసం ఒక మహిళ వచ్చింది. అయితే ఆమె మొబైల్ ఫోన్ చోరీకి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఆ మహిళ కేకలు వేయడంతో అక్కడున్న వారు అలెర్ట్ అయ్యారు. పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతడి చొక్కా విప్పించి ఆ మహిళ ముందు ఉంచారు. దీంతో ఆ వ్యక్తిని ఆమె చితకబాదింది. చెంప చెళ్లుమనిపించడంతోపాటు జుట్టుపట్టుకుని కొట్టింది. తాను తప్పు చేశానని, కొట్టడం ఆపాలని అతడు మొరపెట్టుకున్నా ఆమె కనికరించలేదు. అక్కడున్న కొందరు వ్యక్తులు కూడా తమ ప్రతాపాన్ని చూపారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
महिला की बहादुरी को सलाम…
महिला द्वारा चोर की गई जमकर पिटाई का वीडियो सोशल मीडिया पर हुआ वायरल !!
पुलिस ने भीड़ के चंगुल से लुटेरे को छुड़ाया,
मोबाइल लूट कर भाग रहा था युवक !!यूपी के मेरठ में थाना सदर बाजार क्षेत्र के सोतीगंज जगदीश शरण स्कूल के पास महिला का मोबाइल लूट कर… pic.twitter.com/USUKfhK3vg
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) October 23, 2024