నీట మునిగిన ముంబై.. కొలబా, అంథేరి, కింగ్స్ సర్కిల్ జలమయం

ముంబై : మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ముంబై మహానగరం జలమయం అయ్యింది. ఇవాళ కూడా ముంబైలో వర్షం కురుస్తోంది. నగరంలోని కొలబా ప్రాంతంలో 23.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఇక సాంటాక్రజ్‌లో 107.4 మిల్లిమీటర్ల వర్షం నమోదు అయినట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. మాతుంగ ప్రాంతంలో ఉన్న కింగ్స్ సర్కిల్ వద్ద కూడా భారీ స్థాయిలో నీరు నిలిచిపోయింది. ఏకధాటిగా కురుస్తున్న వానలతో.. వీధుల్లో నీటిమట్టం పెరుగుతోంది. నగరంలోని మహిమ్ ప్రాంతంలో కూడా వారు నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులు చాలా ఇబ్బందిపడుతున్నారు. ఈస్ట్ అంథేరిలో కూడా భారీ స్థాయిలో వర్షం పడడంతో.. ఎక్కడికక్కడ వాననీరు స్తంభించింది. అంథేరీలోని సబ్వే పూర్తిగా నీటిలో మునిగిపోయింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నగరంలో ఇవాళ కూడా తేలికపాటి వర్షం కురుస్తుందని ఐఎండీ చెప్పింది. నగర శివార్లలో భారీ నుంచి అతి భారీ వర్షం నమోదు అయ్యే అవకాశం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

