న్యూఢిల్లీ: అకౌంట్ నెంబర్‌తో కాకుండా.. యూజర్ నేమ్( WhatsApp Username)తో చాటింగ్ చేసుకునే రీతిలో వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేసిన విషయం తెలిసిందే. అయితే యూజర్ నేమ్‌లను రిజర్వ్ చేసుకోవాలని ఇటీవల సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన కస్టమర్లను కోరింది. ఆ ప్రక్రియపై కొంత ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ఫీచర్‌ను నిలిపివేయాలని కోరుతూ బుధవారం కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌కు చెందిన మెటా సంస్థను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే యూజర్ నేమ్ అంశంలో ఇవాళ వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. పబ్లిక్ ఫిగర్లకు చెందిన యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేయడం లేదని, పాపులర్ లేదా ప్రముఖ వ్యక్తుల పేర్లతో యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని వాట్సాప్ పేర్కొన్నది.
వాట్సాప్‌కు చెందిన మెటా సంస్థ ఎఫ్ఏక్యూలను ఇవాళ రిలీజ్ చేసింది. వివాదాస్పద యూజర్‌నేమ్ ఫీచర్ గురించి సందేహాలను నివృత్తి చేసింది. పబ్లిక్ ఫిగర్లకు చెందిన యూజర్‌నేమ్‌ల అంశంలో కేవలం ఆ అకౌంట్ ఓనర్ మాత్రమే రిజర్వ్ చేసుకునే అవకాశం ఉందని వాట్సాప్ చెప్పింది. ఈ కొత్త రకం ఫీచర్ అంశంపై సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే అమలు చేయాలని వాట్సాప్‌ను కేంద్రం కోరిన విషయం తెలిసిందే. భారత మార్కెట్లో వాట్సాప్‌కు ఆదరణ ఎక్కువగా ఉన్నది. ఆ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను సుమారు 50 కోట్ల మంది భారతీయులు వాడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ కొత్త ఫీచర్‌కు వ్యతిరేకంగా కొందరు ప్రముఖ వ్యక్తులు తమ ఎక్స్ అకౌంట్లలో ఆందోళన వ్యక్తం చేశారు. తమ పేర్లకు చెందిన వివిధ వేరియేషన్లతో యూజర్‌నేమ్‌లు ఇప్పటికే రిజర్వ్ అయినట్లు వెల్లడించారు. యూజర్‌నేమ్ ఫీచర్ వల్ల మోసాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆన్లైన్ ఫ్రాడ్, ఫిషింగ్, డిజిటల్ అరెస్టు స్కామ్‌లు జరిగే ఛాన్సు ఉన్నట్లు కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఐటీ చట్టాల ప్రకారం నడుచుకోవాలని కోరుతూ వాట్సాప్ మెటా సంస్థను కేంద్రం కోరింది.
స్కామ్‌లు, మోసాల నుంచి యూజర్లను రక్షించే రీతిలో ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు వాట్సాప్ తన ప్రకటనలో చెప్పింది. ప్రస్తుతం ఆ ఫీచర్‌ను ఇప్పుడే లైవ్ చేయడంలేదని, ఈ ఏడాది చివర వరకు యూజర్ నేమ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. యూజర్‌నేమ్‌తో చాటింగ్ చేసినా.. వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికీ ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరి అవుతుందని మెటా సంస్థ పేర్కొన్నది. యూజర్‌నేమ్‌లతో జరిగే స్కామ్‌లను అడ్దుకునేందుకు మల్టీలేయర్ రక్షణ వ్యవస్థను రూపొందించినట్లు మెటా తెలిపింది.