António Guterres: ముంబై ఉగ్రదాడి మృతులకు యూఎన్ చీఫ్ నివాళి
António Guterres: 2008, సెప్టెంబర్ 26వ తేదీన ముంబైలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని తాజ్ హోటల్ వద్ద ఉన్న స్మారక మ్యూజియం వద్ద ఇవాళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ నివాళి అర్పించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు కూడా ఉంబై ఉగ్రదాడి మృ
ముంబై: 2008, సెప్టెంబర్ 26వ తేదీన ముంబైలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని తాజ్ హోటల్ వద్ద ఉన్న స్మారక మ్యూజియం వద్ద ఇవాళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్(António Guterres) నివాళి అర్పించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు కూడా ఉంబై ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు.
ఉగ్రవాదం ఓ భూతమని, ఎటువంటి కారణాలు ఉగ్రవాదాన్ని సమర్థించలేవని గుటెర్రస్ తెలిపారు. ఈనాటి ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదన్నారు. చాలా హేయమైన ఉగ్ర దాడి జరిగిన ప్రదేశంలో ఉన్నానని, దీని పట్ల చాలా చింతిస్తున్నాని, ఆ నాటి ఉగ్రదాడిలో సుమారు 166 మంది మరణించినట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రస్ చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటం ప్రతి దేశానికి ప్రాధాన్యత కావాలని, ఉగ్రవాదంపై పోరాటం ఐక్యరాజ్యసమితికి సెంట్రల్ ప్రియార్టీ అని గుటెర్రస్ అన్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా యూఎన్ చీఫ్ మంగళవారం ఇండియా చేరుకున్నారు. తాజ్ హోటల్ వద్ద నివాళి తర్వాత ఆయన ఐఐటీ ముంబైలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం గుజరాత్‌లోని కేవడియాలో ప్రధాని మోదీతో జరిగే కార్యక్రమానికి గుటెర్రస్ హాజరుకానున్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఆయన నివాళి అర్పించనున్నారు. ఆ తర్వాత తొలి సోలార్ పవర్ గ్రామాన్ని సందర్శిస్తారు. మోతేరాలోని సూర్య దేవాలయాన్ని కూడా విజిట్ చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

