ముంబై: తునీషా మృతి కేసులో నిందితుడు షీజాన్ ఖాన్‌పై పోలీస్ విచారణ కొనసాగుతున్నది. రెండో రోజైన సోమవారం కూడా పోలీసులు కేసుకు సంబంధించిన పలు అంశాలపై షీజాన్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో నిందితుడు షీజాన్ సోదరి ప్రస్తావన కూడా రావడంతో వాలివ్ పోలీసులు ఆమెను కూడా స్టేషన్‌కు పిలిపించారు.
షీజాన్తోపాటు ఆయన సోదరిని కూడా తునీషా శర్మ మృతి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. యువ నటి తునీషా శర్మ.. శనివారం సాయంత్రం సీరియల్ షూటింగ్ సెట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. టీ బ్రేక్ సమయంలో టాయిలెట్‌కు వెళ్లి అక్కడే ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తునీషాను ఆమె సహ నటుడు, ప్రియుడు షీజాన్ ఖానే ఆత్మహత్యకు పురికొల్పి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తునీషా ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో షీజాన్ కూడా షూటింగ్ సెట్లో నే ఉన్నాడు.