కోల్‌కతా, జూన్ 5: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా విమానం ఎక్కకుండా అధికారులు అడ్డుకున్నారు. సోమవారం ఆమె కోల్‌కతా నుంచి దుబాయ్‌కి వెళ్లడానికి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చా రు. అయితే అక్రమ బొగ్గు కుంభకోణం కేసులో ఆమెపై లుక్అవుట్ నోటీసు ఉన్నదంటూ ఆమెను విమానం ఎక్కకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.