న్యూఢిల్లీ: మాజీ నటి, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani).. వ్యాపారవేత్త జుబిన్ ఇరానీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంత్రి స్మృతి తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్లో ఆమె పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. అయితే ఓ అభిమాని చాలా చికాగు కలిగించే ప్రశ్న వేశారు. వ్యక్తిగత జీవితానికి చెందిన ప్రశ్న వేసినా.. కేంద్ర మంత్రి స్మృతి చాలా ధైర్యంగా ఆ ప్రశ్నకు బదులిచ్చారు. మీరు మీ చిన్ననాటి స్నేహితురాలి భర్తను పెళ్లి చేసుకున్నారా అని ఓ సోషల్ మీడియా యూజర్ అడిగాడు. ఆ ప్రశ్నకు మంత్రి స్మృతి ఇరానీ ఏమాత్రం ఇబ్బందిపడలేదు. ఆ రూమర్లకు చెక్ పెడుతూ.. జుబిన్ ఇరానీ మొదటి భార్య మోనా.. తన కన్నా 13 ఏళ్లు చిన్నదని చెప్పారు. కాబట్టి తమ ఇద్దరికీ ఎటువంటి ఫ్రెండ్షిప్ లేనట్లు వెల్లడించారు. మోనా తన చిన్ననాటి స్నేహితురాలు కాదన్నారు. ఆమె ఫ్యామిలీ వ్యక్తి అని, రాజకీయాలకు లింకులేదన్నారు. ఆమెను ఇందులోకి లాగవద్దు అని, తనతో వాదించండి అని ఆ నెటిజన్‌కు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆమెను గౌరవించాలని మంత్రి తన సమాధానంలో కోరారు. పార్సీ వ్యాపారవేత్త అయిన జుబిన్‌ను 2001లో స్మృతి ఇరానీ పెళ్లి చేసుకున్నారు.