Watch: గుట్కా ప్యాకెట్లలో రూ.33 లక్షల విలువైన విదేశీ నోట్లు.. అక్రమ రవాణా గుట్టురట్టు
కస్టమ్స్ అధికారులు గుట్కా పౌచ్‌లను చింపి పరిశీలించారు. ప్రతి పౌచ్‌లో రెండేసి చొప్పున ఉన్న పది డాలర్ల నోట్లను వెలికితీశారు.
కోల్‌కతా: గుట్కా ప్యాకెట్లలో గుట్టుగా దాచిన సుమారు రూ.33 లక్షల విలువైన విదేశీ కరెన్సీ నోట్ల అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాంకాక్ వెళ్తున్న ఒక ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఒక వ్యక్తి బ్యాంకాక్‌కు వెళ్లేందుకు భారీ లగేజ్‌తో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. కోల్‌కతా కస్టమ్స్‌కు చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఈయూ) అధికారులు అతడి లగేజ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ట్రాలీ సూట్‌కేసులను తెరిచి చూడగా వాటి నిండా గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి.
కాగా, కస్టమ్స్ అధికారులు గుట్కా పౌచ్‌లను చింపి పరిశీలించారు. ప్రతి పౌచ్‌లో రెండేసి చొప్పున ఉన్న పది డాలర్ల నోట్లను వెలికితీశారు. భారత కరెన్సీలో రూ.32.78 లక్షల విలువైన 40 వేల అమెరికా డాలర్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని దీనిపై ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కోల్‌కతా కస్టమ్స్ అధికారులు విడుదల చేశారు. గుట్కా పౌచుల్లో రహస్యంగా దాచిన అమెరికా డాలర్ నోట్లను వెలికి తీసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Acting on intelligence #AIUofficers intercepted a pax scheduled to depart to Bangkok on 08.01.23 after immigration formalities. Search of his checked-in baggage resulted in recovery of US $40O00 (worth ₹3278000) concealed inside Gutkha pouches @cbic_india @PIBKolkata @DDBanglaTV pic.twitter.com/DpxSCL5S3w
— Kolkata Customs (@kolkata_customs) January 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

