న్యూయార్క్: పాప్ మ్యూజిక్ మెగాస్టార్ టేలర్ స్విఫ్ట్(Taylor Swift) పెళ్లి చేసుకున్నది. ఫుట్‌బాల్ ప్లేయర్ ట్రావిస్ కెల్సీ ఆమెను పెళ్లాడాడు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆ వివాహ వేడుక జరిగింది. ఈ ఈవెంట్‌కు హాలీవుడ్ హేమామీలు హాజరయ్యారు. సుమారు వెయ్యి మంది అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా ఆ జంట ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. మన్హటన్ స్పోర్ట్స్ ఎరినాలో ఉన్న భారీ స్క్రీన్‌పై జస్ట్ మ్యారీడ్ అన్న సందేశాన్ని ఇచ్చారు. కమేడియన్ ఆడమ్ సాండ్లర్ సమక్షంలో వివాహం జరిగింది. పాప్ మ్యూజిక్ స్టార్లు జెన్నిఫర్ లోపేజ్, ఎడ్ షీరన్, ఈథన్ హాకీ, జిమ్మీ ఫాలన్, అబ్బే వాంబాచ్ ఆ ఈవెంట్‌కు హాజరయ్యారు.
టేలర్ స్విఫ్ట్ అభిమానులు మాడిసన్ స్క్వేర్‌కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. గతంలో టేలర్ స్విఫ్ట్ తన పాటల్లో రొమాన్స్, బ్రేకప్ గురించి రాసి చాలా పాపులర్ అయ్యింది. పెళ్లి వేడుకను పురస్కరించుకుని ఇటీవల ఆ స్టార్ జంట సుమారు 26 మిలియన్ల డాలర్ల విరాళాన్ని అనాథలకు అందజేశారు. 2023లో జరిగిన ఓ మ్యూజిక్ షోలో ఆ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆ ఇద్దరూ పబ్లిక్‌గా దర్శనమిచ్చారు. ప్రతి మ్యూజిక్ షోకు హాజరయ్యారు.
2025 ఆగస్టులో ఎంగేజ్మెంట్పై ఆ జంట ప్రకటన చేసింది. పాప్ కేటగిరీలో టేలర్ స్విఫ్ట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. లవ్ స్టోరీ, షేక్ ఇట్ ఆఫ్ సాంగ్స్ ఆమెను స్టార్‌ను చేశాయి. 14 గ్రామీ అవార్డులను టేలర్ స్విఫ్ట్ గెలుచుకున్నది. ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ షోలు నిర్వహించి ఓ బిలియనీర్‌గా మారారు. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో కెల్సీ అత్యుత్తమ ప్లేయర్. సూపర్ బౌల్ టోర్నీలో కన్సాస్ సిటీ చీఫ్స్‌కు మూడు సార్లు టైటిల్ అందించాడు.