కరోనా చికిత్సకు నోచుకోక చనిపోతున్న.. పాక్ హిందూ శరణార్థులు

జైపూర్: పాకిస్థాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందూ శరణార్థులు కరోనాకు చికిత్స పొందలేక చనిపోతున్నారు. భారత పౌరసత్వం లభించకపోవడంతో వారిని ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు. దీంతో మహమ్మారి బారిన పడి మరణిస్తున్నారు. రాజస్థాన్ సరిహద్దులోని ఎనిమిది గ్రామాల్లో పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన సుమారు 2,500 హిందూ కుటుంబాలు చాలా కాలంగా నివాసం ఉంటున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో వారు నానా కష్టాలు పడుతున్నారు. భారత పౌరసత్వం పొందకపోవడంతో వారిని విదేశీ శరణార్థులుగానే పరిగణిస్తున్నారు. దీంతో కరోనా పరీక్షలు, వైద్య చికిత్స, వ్యాక్సినేషన్, ఉచిత రేషన్, బీమా వంటివి పొందలేకపోతున్నారు.
మార్చి 20 నుంచి ఒక్క జోధ్‌పూర్‌లోనే ఏడుగురు పాక్ హిందూ శరణార్థులు చనిపోయారు. 2007లో పాక్‌లోని సింధ్ నుంచి భార్య, పిల్లలతో వచ్చిన బేసర్ మాల్ ఈ నెల 2న కరోనాతో మరణించాడు. మరో హిందూ శరణార్థికి కరోనా సోకగా జోధ్‌పూర్‌లోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులు చేర్చుకునేందుకు నిరాకరించాయి. దీంతో కరోనాతో చనిపోయాడు. ఇప్పటికైనా తమను ప్రభుత్వం ఆదుకోవాలని పాక్ హిందూ శరణార్థులు కోరుతున్నారు. మరోవైపు కొందరు బీజేపీ నేతలు వీరి కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

