Onion Price | దేశంలో మండుతున్న ఉల్లి ధరలు.. నియంత్రణకు కేంద్రం చర్యలు
Onion Price | దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు (Onion Price) అమాంతం పెరిగిపోయాయి. ఉల్లిధర వింటే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. దాంతో ఉల్లిగడ్డ ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) రంగంలోకి దిగింది. ఇందులోభాగంగా బఫర్ నిల్వల (Buffer Stock) ను ఉల్లిధర అధికంగా ఉన్న ప్రధాన నగరాలకు తరలిస్తోంది.
Onion Price : దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు (Onion Price) అమాంతం పెరిగిపోయాయి. ఉల్లిధర వింటే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. దాంతో ఉల్లిగడ్డ ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) రంగంలోకి దిగింది. ఇందులోభాగంగా బఫర్ నిల్వల (Buffer Stock) ను ఉల్లిధర అధికంగా ఉన్న ప్రధాన నగరాలకు తరలిస్తోంది. ఇందుకోసం ‘కందా ఎక్స్‌ప్రెస్ (Kanda Express)’ ల పేరుతో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇవాళ్టి నుంచే ఈ రైళ్ల సేవలు ప్రారంభమయ్యాయి.
శనివారం నాటికి దేశంలో ఉల్లి సగటు రిటైల్ ధర కిలోకు రూ.42 కి చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 45 శాతం, గత నెలతో పోలిస్తే 19 శాతం అధికం. ముఖ్యంగా ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.65 కి చేరగా (గత ఏడాది ఇదే సమయానికి రూ.35 ఉంది).. చెన్నైలో రూ.58 కి (గత ఏడాది రూ.33 ఉంది) విక్రయిస్తున్నారు. కేరళ, అసోం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఉల్లిగడ్డ ధరలు గణనీయంగా పెరిగాయి.
దేశంలోనే అతిపెద్ద ఉల్లి ఉత్పత్తిదారు అయిన మహారాష్ట్రలో ఈసారి ఖరీఫ్ పంట దిగుబడి 5 నుంచి 7 శాతం వరకు తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పంట సాగు విస్తీర్ణం తగ్గడం, రుతుపవనాలు ఆలస్యం కావడం వంటివి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. పాత నిల్వలు అడుగంటి కొత్త పంట మార్కెట్లోకి రావడానికి మధ్య ఏర్పడిన ఈ అంతరం కూడా ధరల పెరుగుదలకు దోహదపడింది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుంచి ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గువహటి వంటి నగరాలకు ప్రత్యేక రైళ్ల ద్వారా ఉల్లిని తరలించనున్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే ఈ ప్రణాళికను ధృవీకరించారు. అధిక ధరలున్న మార్కెట్లలో సరఫరా పెంచి, ధరలు మరింత పెరగకుండా నిరోధించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టంచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నాఫెడ్ (NAFED), ఎన్సీసీఎఫ్ (NCCF) సంస్థలు సుమారు 1.2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాయని, ప్రభుత్వంతోపాటు రైతుల వద్ద కూడా తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
కాగా, ‘ధరల స్థిరీకరణ నిధి’ కింద ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టడం కొత్తేమీ కాదు. గతంలో 2024 అక్టోబర్‌లోనూ ఉల్లి ధరల నియంత్రణకు ఇలాంటి ప్రత్యేక రైళ్లనే వినియోగించారు. ఉల్లితోపాటు చక్కెర ధరలు కూడా పెరిగినప్పటికీ (లూజ్ చక్కెర కిలో రూ. 62.5) దేశంలో తగినన్ని నిల్వలు ఉన్నాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

