భువనేశ్వర్ : ప్రముఖ ఒడియా టెలివిజన్ నటుడు సుమన్ కుమార్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఓ యువతిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. రెండేళ్లకుపైగా తనతో ప్రేమ వ్యవహారం నడిపి మోసం చేశాడంటూ పహలా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సుమాన్ కుమార్ను పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ 376 (2)(n), 420, 294, 323తో పాటు 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.