Samrat Choudhary | తలపాగా తీసేసిన డిప్యూటీ సీఎం.. ఎందుకంటే?
Samrat Choudhary | సుమారు 22 నెలలుగా తలపాగా ధరిస్తున్న డిప్యూటీ సీఎం చివరకు దానిని తొలగించారు. తన ప్రతిజ్ఞ నెరవేరడంతో తలపాగా ధరించడం ఆపేస్తున్నట్లు తెలిపారు. నదిలో స్నానమారించి గుండు చేయించుకున్న తర్వాత తలపాగాను రాముడికి అంకితం చేశారు.
పాట్నా: సుమారు 22 నెలలుగా తలపాగా ధరిస్తున్న డిప్యూటీ సీఎం చివరకు దానిని తొలగించారు. తన ప్రతిజ్ఞ నెరవేరడంతో తలపాగా ధరించడం ఆపేస్తున్నట్లు తెలిపారు. నదిలో స్నానమారించి గుండు చేయించుకున్న తర్వాత తలపాగాను రాముడికి అంకితం చేశారు. (Samrat Choudhary) 2022లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయే కూటమిని వీడారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ సీఎంగా రాజీనామా చేసేవరకు తలపాగా తీయబోనని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి శపథం చేశారు.
కాగా, కొన్ని నెలలకే నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎన్డీయేతో తిరిగి జతకట్టిన ఆయన మళ్లీ సీఎం పదవి చేపట్టారు. ఈ నేపథ్యంలో తన ప్రతిజ్ఞ నెరవేరిందని డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. బుధవారం అయోధ్యను ఆయన సందర్శించారు. తలపాగా తీసేసిన సామ్రాట్ చౌదరి సరయూ నదిలో స్నానమాచరించారు. అనంతరం గుండు చేయించుకున్నారు. 22 నెలలుగా ధరిస్తున్న తలపాగాను రాముడికి అంకితం చేస్తానని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
प्रभु श्रीराम के पावन चरणों में अपने मुरेठे को समर्पित किया।#Ayodhya_dham_mein_Samrat pic.twitter.com/0e6kyyaC97
— Samrat Choudhary (@samrat4bjp) July 3, 2024
भक्ति और शक्ति का निवास -हनुमानगढ़ी
आज धर्मनगरी श्री अयोध्याधाम स्थित श्री हनुमानगढ़ी में प्रभु श्री राम के अनन्य भक्त, अंजनिपुत्र, पवनपुत्र श्री हनुमान जी का दर्शन-पूजन कर चराचर जगत के कल्याण की कामना की।
ॐ हनुमते नमः!
।।जय-जय श्रीराम।।#Ayodhya_dham_mein_Samrat pic.twitter.com/TR2fCSDI8y
— Samrat Choudhary (@samrat4bjp) July 3, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

