Minor domestic help tortured | ఇంటి పనులు చేసే బాలికకు చిత్రహింసలు.. సిగరెట్, కాల్చిన అట్లకాడతో వాతలు పెట్టిన దంపతులు
Minor domestic help tortured | ఇంటి పనులు చేసే బాలికను దంపతులు చిత్రహింసలకు గురి చేశారు (Minor domestic help tortured). సిగరెట్, కాల్చిన అట్లకాడతో ఆమె శరీరంపై వాతలు పెట్టారు. అలాగే ఊరికి వెళ్లిన ఆ దంపతులు ఆ బాలికను తమ ఇంట్లో నిర్బంధించారు. పవర్ కట్ వేళ ఆ బాలిక భయంతో కేకలు వేయగా చిత్రహింసల విషయం బయటపడింది.
ముంబై: ఇంటి పనులు చేసే బాలికను దంపతులు చిత్రహింసలకు గురి చేశారు (Minor domestic help tortured). సిగరెట్, కాల్చిన అట్లకాడతో ఆమె శరీరంపై వాతలు పెట్టారు. అలాగే ఊరికి వెళ్లిన ఆ దంపతులు ఆ బాలికను తమ ఇంట్లో నిర్బంధించారు. పవర్ కట్ వేళ ఆ బాలిక భయంతో కేకలు వేయగా చిత్రహింసల విషయం బయటపడింది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. అథర్వ నగరి హౌసింగ్ సొసైటీలో నివసించే దంపతులు ఇంటి పనుల కోసం మూడేండ్ల కిందట 12 ఏండ్ల బాలికను బెంగళూరు నుంచి తెచ్చారు. మంచిగా చూసుకుంటామని, చదివిస్తామని బాలిక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
కాగా, ఆ బాలికతో ఇంటి పనుల చాకిరి చేయిస్తున్న ఆ దంపతులు ఆమెను టార్చర్ చేశారు. తప్పులు చేసినప్పుడు దారుణంగా హింసించారు. కాలిన సిగరెట్, కత్తిని కాల్చి, అలాగే కాలిన అట్లకాడతో వీపుపై వాతలు పెట్టేవారు. ఈ నేపథ్యంలో ఆ బాలిక శరీరంపై కాలిన గాయాలున్నాయి.
మరోవైపు ఆ దంపతులు ఇటీవల బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ బాలికను ఒంటరిగా ఇంట్లో ఉంచి తాళం వేశారు. అయితే కరెంట్ లేని సమయంలో ఆ బాలిక సహాయం కోసం కిటికీ నుంచి కేకలు వేసింది. గమనించిన పొరుగువారు ఆ ఇంటి డోర్‌ను బద్ధలుకొట్టి ఆ బాలికను రక్షించారు. ఒక ఎన్జీవో సంస్థకు ఆమెను అప్పగించారు.
కాగా, ఆ బాలిక శరీరంపై కాలిన గాయాలు ఉండటం చూసిన ఎన్జీవో సంస్థ సిబ్బంది దీని గురించి ఆరా తీశారు. ఇంటి పనులు చేయిస్తున్న దంపతులు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆమె చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడ ఉన్న దంపతులను అరెస్ట్ చేసి నాగపూర్ పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

