judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
judge's Minor son drives Car hits scooter | ఒక న్యాయమూర్తికి చెందిన మైనర్ కుమారుడు లగ్జరీ కారు నడిపాడు. ఒక స్కూటీని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో జడ్జి కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరువనంతపురం: ఒక న్యాయమూర్తికి చెందిన మైనర్ కుమారుడు లగ్జరీ కారు నడిపాడు. ఒక స్కూటీని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో జడ్జి కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళంలోని కొచ్చిలో ఈ సంఘటన జరిగింది. (judge’s Minor son drives Car hits scooter) ఒక న్యాయమూర్తికి చెందిన 17 ఏళ్ల కుమారుడు మెర్సిడెస్ కారు నడిపాడు. ఆదివారం తెల్లవారుజామున ఒక స్కూటర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. స్కూటీ నడుపుతున్న వ్యక్తి మరణించాడు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని 55 ఏళ్ల జయబాలకృష్ణన్గా గుర్తించారు. కారు నడిపిన జడ్జి కుమారుడైన 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో నిందితుడు మద్యం సేవించి లేడని పోలీస్ అధికారి తెలిపారు. అయితే మరింత నిర్ధారణ కోసం అతడి రక్త నమూనాలను సేకరించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వివరించారు.
మరోవైపు ఈ ప్రమాదం తర్వాత ఆ న్యాయమూర్తి తమతో చాలా అగౌరవంగా మాట్లాడినట్లు మృతుడి బంధువైన మహిళ ఆరోపించారు. మైనర్ బాలుడు కారు నడపడానికి ఎలా అనుమతించారని ఆమె ప్రశ్నించారు. ‘ఈ కేసును మేం ముందుకు తీసుకువెళ్తాం. ఆ న్యాయమూర్తి వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకుంటే ఇది అవసరం. అంతేకాకుండా, లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదనే విషయం అందరికీ ఒక పాఠం కావాలి’ అని మీడియాతో ఆమె అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

