సెక్యూరిటీ కళ్లగప్పి… సీఎం మమతా నివాసంలోకి చొరబడిన వ్యక్తి
కోల్‌కతా: ఇరవై నాలుగు గంటలూ కాపలా ఉండే సెక్యూరిటీ కళ్లగప్పిన ఒక వ్యక్తి ఏకంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అధికార నివాసంలోకి చొరబడ్డాడు. ఆ నివాస ప్రాంగణంలోని ఒక మూల నక్కిన అతడ్ని భద్రతా సిబ్బంది గుర్తించి అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. దక్షిణ కోల్‌కతా కాళీఘాట్ ప్రాంతంలోని హరీష్ ఛటర్జీ స్ట్రీట్‌లో సీఎం మమతా బెనర్జీ అధికార నివాసం ఉంది. టోలీస్ కెనాల్‌గా పిలిచే గంగానది పాత కాలువకు సమీపంలో ఒక అంతస్థు భవనం ఇది. జడ్ కేటగిరీ సెక్యూరిటీతో పాటు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది నిరంతరం అన్ని వైపులా ఆ నివాసానికి భద్రతగా ఉంటారు.
అయితే ఒక వ్యక్తి కాలువ వైపు ఉన్న భవనం పశ్చిమవైపు ప్రహరీ గోడ దూకి లోనికి చొరబడ్డాడు. ఒక మూల నక్కి ఉన్న అతడ్ని భద్రతా సిబ్బంది గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి వద్ద ఎలాంటి ఆయుధం లేదని పోలీసులు తెలిపారు. శనివారం అర్ధ రాత్రి తర్వాత లేదా ఆదివారం ఉదయం ఆ వ్యక్తి ఆకతాయి తనంగా లోనికి చొరబడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ హుటాహుటిన సీఎం మమతా బెనర్జీ నివాసానికి చేరుకున్నారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వ్యక్తి చొరబాటు, భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా తగిన చర్యలు చేపడతామని అన్నారు. పోలీసులు ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

