జల్నా, మార్చి 30: తన బంగళాకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడంపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే బాబన్రావు లోనికర్ రాష్ట్ర విద్యుత్తు సరఫరా కంపెనీ(ఎమ్మెస్ఈడీసీఎల్) అధికారికి ఫోన్ చేసి బెదిరించారు.
ఐటీ దాడులు చేయిస్తానని హెచ్చరించారు. ఈ ఆడియో క్లిప్ వైరల్ అయింది. దీనిపై లోనికర్ స్పందించారు. తాను ఏ అధికారితో మాట్లాడలేదని, బెదిరించలేదని చెప్పారు. ఆ ఆడియో ఫేక్ అని పేర్కొన్నారు.