కర్ణాటకలో జూన్ 7 వరకు లాక్డౌన్.. ఉత్తర్వులు ఇచ్చిన సీఎం
జూన్ 7 వరకు లాక్డౌన్ | రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ పొడిగించింది. వచ్చే 7 వతేదీ వరకు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు.

బెంగళూర్ : రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ పొడిగించింది. వచ్చే 7 వతేదీ వరకు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుకున్నట్లు తెలిపారు.
మే 24 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉండగా నిపుణుల సూచనల మేరకు పొడిగించినట్లు సీఎం మీడియాకు వెల్లడించారు. ‘‘ఉదయం 10 గంటల తరువాత కూడా కొంతమంది బయట తిరుగుతూ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. అనవసరంగా బయట తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించాలి’ అని పోలీసులను సీఎం యడియూరప్ప ఆదేశించారు.
బ్లాక్ ఫంగస్ బారినపడిన వారికి ప్రభుత్వమే జిల్లా ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో మే 10 నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు మినహాయింపు నిచ్చింది. అత్యవసర సర్వీసులతోపాటు వ్యాక్సినేషన్ కోసం వెళ్లే వారికి మినహాయింపు ఉంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 5.3 లక్షలకు చేరాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

