రేపే నేవీలోకి ఐఎన్ఎస్ మర్ముగోవా యుద్ధ నౌక
INS Mormugao :మర్ముగోవా యుద్ధ నౌక.. ఆదివారం నౌకాదళంలోకి చేరనున్నది. ఇది పీ15 బ్రేవర్ క్లాసుకు చెందినది. ఈ నౌకలో అన్ని రకాల ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఎటువంటి సమయంలోనైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చు అని కమాండర్ అన్షుల్ శర్మ తెలిపారు. యాంటీ ఎయిర్, యాంటీ సబ్‌మెరైన్ ఆయుధాలు ఈ షి
న్యూఢిల్లీ: మర్ముగోవా యుద్ధ నౌక.. ఆదివారం నౌకాదళంలోకి చేరనున్నది. ఇది పీ15 బ్రేవర్ క్లాసుకు చెందినది. ఈ నౌకలో అన్ని రకాల ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఎటువంటి సమయంలోనైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చు అని కమాండర్ అన్షుల్ శర్మ తెలిపారు. యాంటీ ఎయిర్, యాంటీ సబ్‌మెరైన్ ఆయుధాలు ఈ షిప్లో ఉన్నట్లు ఆయన చెప్పారు. మిస్సైల్ వ్యవస్థ కూడా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హిందూ మహాసముద్రంలో రక్షణ, నౌకాదళ సత్తాను పెంచనున్నట్లు ఆయన తెలిపారు.
ఐఎన్ఎస్ మర్ముగోవా.. సెకండ్ జనరేషన్‌కు చెందిన స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్. ప్రాజెక్టు 15బీ కింద దీన్ని తయారు చేశారు. ప్రాజెక్టు 15బీ కింద మొత్తం నాలుగు నౌకల కోసం 2011లో కాంట్రాక్టు జరిగింది. అయితే గత ఏడాది ఐఎన్ఎస్ విశాఖపట్టణంను జలప్రవేశం చేశారు. గోవాలోని మర్ముగోవా సిటీ పేరును దీనికి పెట్టారు.
మర్ముగోవా నౌక 163 మీటర్ల పొడుగు, 17 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది సుమారు 7400 టన్నుల బరువు ఉంటుంది. దీని అత్యధిక వేగం 30 నాట్స్ అని ఇండియన్ నేవీ ఓ ప్రకనటలో తెలిపింది. భారత నౌకాదళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీన్ని డిజైన్ చేసింది. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ దీన్ని నిర్మించారు. విశాఖపట్టణం, మర్మగోవా, ఇంపాల్, సూరత్ నగరాల పేరు మీద నాలుగు విధ్వంసక యుద్ధ నౌకలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా ప్రారంభమైన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

