హైదరాబాద్ : ఐమ్యాక్స్ కార్పొరేషన్ బ్రాడ్వే మెగాప్లెక్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇండియాలోని కోయంబత్తూరులో బ్రాడ్వే నూతనంగా ప్రణాళిక చేసిన మెగాప్లెక్స్ ప్రాంగణంలో నూతన ఐమ్యాక్స్ థియేటర్ అభివృద్ధి చేసేందుకు ఒప్పందం చేసినట్లు ఆరెండు సంస్థలు ప్రకటించాయి. 2022 సమ్మర్ లో దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంటర్ నేషనల్ టెక్నాలజీ సంస్థ ప్రాంతీయ మెగాప్లెక్స్ చైన్ లమధ్య జరిగిన మొట్టమొదటి ఒప్పందం ఇది.
ఈ థియేటర్లో ఫ్యూచర్ జనరేషన్ లేజర్ ప్రొజెక్షన్ వ్యవస్థతో కూడిన లేజర్ సాంకేతికత, ఐమ్యాక్స్ థియేటర్లలో ప్రత్యేకంగా కనిపించే 12 చానెల్ సౌండ్ సిస్టమ్ ను ఐమ్యాక్స్ కలిగి ఉంటుంది. నూతన ఐమ్యాక్స్ థియేటర్లో ప్రదర్శించే చిత్రాలను ఐమ్యాక్స్ ప్రొప్రైయిటరీ డిజిటల్ మీడియా రీ-మాస్టరింగ్ లేదా డీఎంఆర్ ప్రక్రియలో ఆప్టిమైజ్ చేయనున్నారు.
‘‘దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ మల్టీప్లెక్స్ గొలుసుకట్టు సంస్థ బ్రాడ్వే మెగాప్లెక్స్తో మా మొట్టమొదటి భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. దీని ద్వారా నూతన, మహోన్నతమైన మెగాప్లెక్స్ ప్రాంగణానికి ఐమ్యాక్స్ను తీసుకురాబోతున్నాము’’అని ఐమ్యాక్స్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ జియోవాన్నీ డోల్సీ అన్నారు.