టీతో ఆయుర్దాయం మెరుగు!
చటుక్కున ఓ కప్పు చాయ్ తాగేస్తే ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు పరిశోధకులు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు టీ కూడా చేర్చితే.
బెథెస్డా (అమెరికా), ఆగస్టు 30: చటుక్కున ఓ కప్పు చాయ్ తాగేస్తే ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు పరిశోధకులు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు టీ కూడా చేర్చితే.. టీ తాగని వారికన్నా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. ఇప్పటివరకు గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని చాలా పరిశోధనల ద్వారా తెలిసింది. కానీ తాజాగా మనం రెగ్యులర్‌గా తీసుకునే టీ వల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయని అమెరికాలోని నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దాదాపు 14 ఏండ్ల పాటు బ్రిటన్‌లోని 5 లక్షల మందిని పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు. రోజుకు రెండు కన్నా ఎక్కువ కప్పుల టీ తాగిన వారిలో 9 శాతం నుంచి 13 శాతం వరకు మరణాలు తగ్గాయని వివరించారు. అయితే హృద్రోగ సంబంధ మరణాలను మాత్రమే ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. క్యాన్సర్‌కు సంబంధించి ఎలాంటి సంబంధం ఉన్నట్టు ఇందులో పేర్కొనలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- drink tea
- tea
- Tea For health
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

