Groom Killed: హైస్పీడ్‌లో గోడను ఢీకొన్న బొలెరో.. వరుడితో పాటు 8 మంది మృతి
Groom Killed: పెళ్లి బృందంతో అతి వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం గోడను ఢీకొన్న ఘటన యూపీలో జరిగింది. ఆ ప్రమాదంలో పెళ్లి కొడుకుతో పాటు 8 మంది మృతిచెందారు. మృతులకు పీఎంవో ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
సంభల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బెలెరో వాహనం ఓ గొడను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది మరణించారు. వాళ్లు అంతా ఒకే కుటుంబానికి చెందినవారు. పెళ్లి కోసం వెళ్తున్న సమయంలో.. అదుపు తప్పి వాహనం గోడను ఢీకొన్నది. మృతుల్లో 24 ఏళ్ల పెళ్లి కుమారుడు(Groom Killed:) ఉన్నాడు. ఉదయం 6.30 ప్రాంతంలో జివానై గ్రామంలో ఘటన చోటుచేసుకున్నది. హై స్పీడ్‌లో వెళ్తున్న వాహనం.. జనతా ఇంటర్ కాలేజీ వద్ద అదుపు తప్పింది.
పెళ్లి బృందంతో వెళ్తున్న ఆ వాహనంలో మొత్తం 10 మంది ఉన్నారు. వధువు సూరజ్ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సంభల్‌లోని హర్ గోవిందపుర్ గ్రామం నుంచి వధువుకు చెందిన సిర్తౌల్ గ్రామానికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ప్రమాదంలో అయిదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ముగ్గురు చికిత్స సమయంలో ప్రాణాలు విడిచారు. ఇద్దరు ప్రయాణికులు ప్రస్తుతం క్రిటికల్ దశలో ఉన్నారు. బొలెరో వాహనంలో సామర్థ్యానికి మించి ప్యాసింజెర్లు ఉన్నారు. జనతా ఇంటర్ కాలేజీ గోడను ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్లు ఏసీపీ అనుకృత్ శర్మ తెలిపారు.
ప్రమాదం పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. పీఎంవో సోషల్ మీడియా అకౌంట్లో సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని వేడుకున్నారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి 50వేలు ఇవ్వనున్నారు.
Deeply saddened by the loss of lives in an accident in Sambhal, Uttar Pradesh. Condolences to those who have lost their loved ones in the mishap. May the injured recover soon.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured…
— PMO India (@PMOIndia) July 5, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

