Blast | గ్యాస్ లీకై ఇంట్లో భారీ పేలుడు.. 9 మందికి తీవ్ర గాయాలు..!
Blast | గ్యాస్ సిలిండర్ లీక్ (Gas leak) కావడంతో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఫతేపూర్ జిల్లా (Fathepur District) లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులను మెరుగైన చికిత్స కోసం కాన్పూర్ (Kanpur) లోని ఆస్పత్రికి తరలించారు.
Blast : గ్యాస్ సిలిండర్ లీక్ (Gas leak) కావడంతో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఫతేపూర్ జిల్లా (Fathepur District) లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులను మెరుగైన చికిత్స కోసం కాన్పూర్ (Kanpur) లోని ఆస్పత్రికి తరలించారు. కల్యాణ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిల్ఖిని గ్రామంలో గత రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సంతోష్ లోధి అనే వ్యక్తి భార్య కళావతి ఇంట్లో వంట చేస్తుండగా పైపు నుంచి గ్యాస్ లీకైంది. క్షణాల్లో ఇల్లంతా గ్యాస్ వ్యాపించి, ఒక్కసారిగా మంటలు అంటుకుని భారీ పేలుడు సంభవించింది.
ఈ పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి ఆర్తనాదాలు విని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కూడా మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లు, అంబులెన్స్‌లతో ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ మల్వాన్ మెడికల్ కాలేజీకి తరలించారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాన్పూర్‌కు రిఫర్ చేశారు. బాధితులను త్వరగా ఆసుపత్రికి చేర్చేందుకు అధికారులు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ అభిమన్యు మాంగ్లిక్.. గ్యాస్ లీకేజీ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. సిలిండర్ పేలలేదని, కేవలం గ్యాస్ మాత్రమే లీకై మంటలు చెలరేగాయని ఆయన స్పష్టంచేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా కాన్పూర్‌లో ప్రత్యేక అధికారులను నియమించామని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కాగా ప్రస్తుతం బాధితులంతా కాన్పూర్‌లోని హాలెట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

