Disha Salian | ఆదిత్య ఠాక్రేపై కేసు నమోదు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన దిశా సాలియన్ తండ్రి
Disha Salian | దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె సామూహిక అత్యాచారానికి గురైందని, క్రూరమైన లైంగిక వేధింపులను అనుభవించిందని ఆరోపించారు.
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salian) తండ్రి సతీష్ సాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె సామూహిక అత్యాచారానికి గురైందని, క్రూరమైన లైంగిక వేధింపులను అనుభవించిందని ఆరోపించారు. శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఇతరులపై కేసు నమోదు చేసి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరారు. గురువారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, 2020 జూన్ 8న మలాడ్‌లోని ఎత్తైన భవనం 14వ అంతస్తు నుంచి కిందపడి దిశా సాలియన్ మరణించింది. యాక్సిడెంటల్ డెత్‌గా పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె మరణంలో ఎలాంటి అనుమానం లేదని దిశా తండ్రి సతీశ్ నాడు తెలిపారు. దర్యాప్తు పట్ల పూర్తిగా సంతృప్తి చెందినట్లు ఆయన చెప్పారు.
అయితే దిశా సాలియన్ మరణించిన ఐదేళ్ల తర్వాత ఆమె తండ్రి సతీష్ సాలియన్ తాజాగా బాంబే హై కోర్టును ఆశ్రయించారు. 2020 జూన్ 8న తన ఇంట్లో దిశా పార్టీ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఆదిత్య ఠాక్రే, ఆయన బాడీ గార్డులు, నటులు సూరజ్ పంచోలి, డినో మోరియాతో పాటు మరికొందరు ఈ పార్టీకి హాజరైనట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
మరోవైపు ఈ పార్టీ సందర్భంగా దిశాపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని ఆమె తండ్రి సతీష్ ఆరోపించారు. బిల్డింగ్ పైనుంచి కిందపడి దిశ చనిపోయిందని చెబుతున్నప్పటికీ ఆమె శరీరంలో ఒక్క ఫ్రాక్చర్ కూడా లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో రక్తం మరకలు కూడా లేవన్నారు.
నిందితులను రక్షించడానికి రాజకీయ ఒత్తిళ్లతో ఫోరెన్సిక్ సాక్ష్యాలను ధ్వంసం చేశారని, సీసీటీవీ ఫుటేజీని కూడా తారుమారు చేశారని దిశా తండ్రి ఆరోపించారు. సరైన పోస్ట్‌మార్టం విశ్లేషణ లేకుండానే హడావుడిగా దహన సంస్కారాలు చేసినట్లు ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన అదే రోజున శవపరీక్ష నిర్వహించగా, దిశ పోస్ట్‌మార్టం 50 గంటలకు పైగా ఆలస్యమైందని సతీష్ పేర్కొన్నారు. ‘ప్రధాన నిందితుడు ఆదిత్య ఠాక్రే’ను రక్షించడానికి లైంగిక వేధింపుల సాక్ష్యాలను నాశనం చేయడం లక్ష్యంగా పోస్ట్‌మార్టం ఆలస్యంగా జరిగిందని ఆ పిటిషన్లో ఆరోపించారు. ఆదిత్య ఠాక్రే, ఇతరులపై కేసు నమోదు చేసి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరారు. తన న్యాయవాది ద్వారా ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

